Breaking News

మళ్లీ మొదటి నుంచి పంజాబ్, దిల్లీ మ్యాచ్


Published on: 13 May 2025 17:43  IST

భారత్, పాకిస్థాన్‌ మధ్య ఉద్రిక్తతల కారణంగా వాయిదా పడిన ఐపీఎల్‌ను మే 17 నుంచి పున: ప్రారంభించాలని బీసీసీఐ నిర్ణయించిన సంగతి తెలిసిందే. భద్రతా కారణాల రీత్యా పంజాబ్, దిల్లీ మ్యాచ్‌ను మధ్యలోనే నిలిపివేశారు.అయితే, కొత్తగా ప్రకటించిన షెడ్యూల్‌తో దీనిపై క్లారిటీ వచ్చింది. మే 24న జైపుర్‌ వేదికగా పంజాబ్, దిల్లీ మ్యాచ్‌ జరగనుంది. ధర్మశాలలో జరిగిన 10.1 ఓవర్ల ఆటతో సంబంధం లేకుండా మళ్లీ మొదటి నుంచి మ్యాచ్‌ను నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది.

Follow us on , &

ఇవీ చదవండి