Breaking News

వంశీని ఆసుపత్రికి తరలించిన పోలీసులు


Published on: 13 May 2025 18:29  IST

గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి వ్యవహారంలో కీలక సాక్షి సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీని మంగళవారం పోలీసులు ఎస్సీ, ఎస్టీ కేసుల ప్రత్యక కోర్టులో హాజరు పరిచారు. ఈ సందర్భంగా తనకు అనారోగ్యంగా ఉందని తాను మాట్లాడేందుకు ఊపిరి తీసుకోవడానికి కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నానని కోర్టుకు ఆయన వివరించారు. ఈ నేపథ్యంలో వల్లభనేని వంశీని ఆసుపత్రికి తీసుకు వెళ్లి వైద్య చికిత్స అందించాలని పోలీసులను కోర్టు ఆదేశించింది. 

Follow us on , &

ఇవీ చదవండి