Breaking News

పంట‌ న‌ష్టప‌రిహారం నిధులు విడుద‌ల..!


Published on: 29 May 2025 18:35  IST

తెలంగాణలోని రైతులకు బిగ్ రిలీఫ్ ఇచ్చింది ప్రభుత్వం. గ‌త రెండు నెల‌లుగా అకాల వ‌ర్షాలతో నష్ట‌పోయిన రైతుల‌కు పంట నష్ట ప‌రిహారం నిధులను విడుదల చేసింది. 2 నెలల్లో 29 జిల్లాల్లో 5,528 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. 41,361 మంది రైతులకు సంబంధించి రూ.51.528 కోట్లు విడుద‌ల చేసింది ప్రభుత్వం. ఈ పరిహారాన్ని నేరుగా రైతుల ఖాతాల్లోనే జమ చేయాలని సంబంధిత అధికారులను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు.

Follow us on , &

ఇవీ చదవండి