Breaking News

ఇవాళే జేఈఈ మెయిన్ 2026 ఫలితాలు..


Published on: 16 Feb 2026 15:58  IST

ఇంజనీరింగ్ విద్యార్థుల నిరీక్షణకు ఇవాళ తెరపడనుంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సోమవారం JEE మెయిన్ 2026 సెషన్-1 ఫలితాలను అధికారికంగా విడుదల చేయనుంది. జనవరి 21 నుండి జనవరి 29 వరకు జరిగిన ఈ ప్రతిష్టాత్మక పరీక్షా ఫలితాల కోసం దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఆసక్తిగా ఎదురుచూస్తు న్నారు. అభ్యర్థులు తమ ఫలితాలను, స్కోర్ కార్డ్‌లను నేరుగా అధికారిక వెబ్‌సైట్‌ల నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. jeemain.nta.nic.in, nta.ac.in వెబ్‌సైట్ల ద్వారా ఫలితాలను తెలుసుకోవచ్చు.

Follow us on , &

ఇవీ చదవండి