Breaking News

గిరిజన ప్రాంతాల పట్ల కాంగ్రెస్‌ నిర్లక్ష్యం


Published on: 16 Feb 2026 15:41  IST

గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి పట్ల కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తండాలను గ్రామ పంచాయతీలుగా ప్రకటించినా.. సరైన నిధులు విడుదల చేయలేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ఐటీడీఏ ద్వారా అందిస్తున్న నిధులతో నే గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి జరుగుతోందని స్పష్టం చేశారు. సంత్‌ సేవాలాల్‌ మహారాజ్‌ జయంతి సందర్భంగా ఆదివారం ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

Follow us on , &

ఇవీ చదవండి