Breaking News

బీహార్‌లో హెచ్‌ఐవీ కలకలం..


Published on: 12 Dec 2025 17:27  IST

బీహార్‌ రాష్ట్రంలో హెచ్‌ఐవీ పాజిటివ్‌ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఒక్క సీతామర్హి జిల్లాలోనే ఏకంగా 7,400 మందికిపైగా హెచ్‌ఐవీ పాజిటివ్‌గా తేలింది. వారిలో 400 మందికిపైగా చిన్నారులే ఉండటం గమనార్హం. జిల్లా ఆసుప‌త్రిలోని ఏఆర్‌టీ సెంటర్‌లో నిర్వహించిన వైద్య పరీక్షల్లో ఈ షాకింగ్ వాస్తవాలు బయటపడ్డాయి.400 మందికిపైగా పిల్లలకు వారి తల్లిదండ్రుల నుంచి వైరస్‌ సంక్రమించినట్లు వైద్యులు నిర్ధారించారు. ఇది చాలా ఆందోళనకరమైన పరిస్థితి అని వైద్య అధికారులు తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి