Breaking News

మళ్లీ డ్రోన్ల కలకలం.. నేలమట్టం చేసిన భారత బలగాలు


Published on: 13 May 2025 09:52  IST

కాల్పుల విరమణ ఒప్పందం సమగ్రస్థాయిలో అమలుకు భారత్‌ ప్రయత్నిస్తున్న వేళ సోమవారం రాత్రి మళ్లీ జమ్మూకశ్మీర్‌లోని సాంబా సెక్టార్‌లో అనుమానాస్పద డ్రోన్లు కలకలం సృష్టించాయి. వీటిని వెంటనే భారత భద్రతా బలగాలు నేలమట్టం చేశాయి. చిన్నపాటి డ్రోన్లతో ఆందోళన చెందాల్సిన పనిలేదని ఆర్మీ అధికారులు స్పష్టంచేశారు. ఆవలి నుంచి అంతర్జాతీయ సరిహద్దు దాటి దూసుకొచ్చిన డ్రోన్లను ఆర్మీ డిఫెన్స్‌ గన్స్‌తో పేల్చేసిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో షేర్‌ అవుతున్నాయి.

Follow us on , &

ఇవీ చదవండి