Breaking News

నేడు, రేపు ఏపీలో భారీ వర్షాలు!


Published on: 13 May 2025 11:29  IST

నైరుతి రుతుపవనాలు చురుకుగా ముందుకు కదులుతున్నాయి. రాబోయే 4 నుంచి 5 రోజుల్లో అండమాన్, నికోబార్‌ దీవులు, దక్షిణ, మధ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉంది. అయితే ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు వారం ముందుగానే ప్రవేశించాయి. దీంతో గడచిన 24 గంటల నుంచి నికోబార్ దీవులలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రవ్యాప్తంగా చెదురుమదురు వర్షాలు కురుస్తాయని భావిస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి