Breaking News

ఊహించని విషాదం..కాంతార నటుడు కన్నుమూత..


Published on: 13 May 2025 12:33  IST

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాంతార చాప్టర్ 1 నటుడు రాకేష్ పూజారి కన్నుమూశాడు. 33 ఏళ్లకే ఈ లోకాన్ని విడిచివెళ్లిపోయాడు. నిన్న ఉడిపిలో జరిగిన ఓ మెహందీ ఫంక్షన్‌లో రాకేష్ పాల్గొన్నాడు. మిత్రులతో కలిసి సందడి చేశాడు. వారితో మాట్లాడుతూ ఉండగానే అతడికి గుండె పోటు వచ్చింది. అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. స్నేహితులు రాకేష్‌ను వెంటనే దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. రాకేష్‌ను పరీక్షించిన డాక్టర్లు అప్పటికే అతడు చనిపోయినట్లు ధ్రువీకరించారు.

Follow us on , &

ఇవీ చదవండి