Breaking News

సైన్యానికి సంఘీభావం


Published on: 11 May 2025 18:44  IST

ఉగ్రదాడులకు వ్యతిరేకంగా భారత సైనికులకు సంఘీభావంగా తమిళనాడు సీఎం స్టాలిన్‌ నేతృత్వంలో చెన్నైలో శనివారం భారీ ర్యాలీ జరిగింది. డీజీపీ కార్యాలయం నుంచి వార్‌ మెమోరియల్‌ వరకు సాగిన ఈ ర్యాలీలో మంత్రులు, ఎంపీలు, మాజీ సైనికులు, విద్యార్థులు, ప్రజలు పెద్ద సంఖ్యలో జాతీయ పతాకాలతో పాల్గొన్నారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీరులకు ఇది అర్పించిన కృతజ్ఞతాంజలిగా ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ ర్యాలీ దేశభక్తికి నిదర్శనంగా నిలిచింది.

Follow us on , &

ఇవీ చదవండి