Breaking News

పట్టు రైతుకు లాభాల గూళ్లు


Published on: 16 Feb 2026 15:28  IST

రాష్ట్రంలో పట్టు గూళ్ల (కొకూన్‌) ధరలు భారీగా పెరిగాయి. సగటు ధర కూడా గణనీయంగా పెరిగింది. రాష్ట్రంలోని అన్ని పట్టు గూళ్ల మార్కెట్లలో 2వారాల నుంచి కిలో కొకూన్‌ గరిష్ఠ ధర రూ.959 ఉండగా, సగటు ధర రూ.812 నుంచి రూ.848కి చేరింది. కర్ణాటకలోని రాంనగర్‌ మార్కెట్‌లో గరిష్ఠ ధర రూ.1,000 ఉండగా, సగటు ధర రూ.798 నుంచి రూ.824కు చేరింది.గత పక్షం రోజుల్లో కర్ణాటకలో కన్నా ఏపీలో సగటు ధర ఎక్కువగా ఉంది. కర్ణాటకలో గరిష్ఠ ధరతో పరిమితంగానే క్రయవిక్రయా లు జరిగినట్లు సమాచారం.

Follow us on , &

ఇవీ చదవండి