Breaking News

కాంగ్రెస్‌కు ఛైర్‌పర్సన్‌.. భారాసకు వైస్‌ ఛైర్‌పర్సన్‌ !


Published on: 16 Feb 2026 17:38  IST

కామారెడ్డి ఛైర్‌పర్సన్‌ పీఠాన్ని దక్కించుకోవడానికి కాంగ్రెస్‌పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. హైదరాబాద్‌లో పార్టీ నాయకులు ఆదివారం ప్రత్యేకంగా సమావేశమై జరిగే పరిణామాలపై చర్చించారు. ఛైర్‌పర్సన్‌ పదవి చేజిక్కుంచుకోవడానికి ఉన్న అవకాశాలపై ఆరా తీశారు. కార్యక్రమంలో మంత్రి అజారుద్దీన్, ఎంపీ సురేశ్‌ షెట్కార్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీ, మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ నేరెళ్ల శారద, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌ మద్ది చంద్రకాంత్‌రెడ్డి, పట్టణాధ్యక్షుడు పండ్ల రాజు తదితరులు పాల్గొన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి