Breaking News

త్వరలో మహానగర డిజిటల్‌ ట్విన్‌


Published on: 16 Feb 2026 17:49  IST

హైదరాబాద్‌ మహానగరాన్ని పోలిన మరో 3డీ డిజిటల్‌ ట్విన్‌ నగరానికి రూపకల్పనకు హెచ్‌ఎండీఏ కసరత్తు షురూ చేసింది. దీనికి సంబంధించి సంస్థను ఎంపిక చేసేందుకు ఆసక్తి వ్యక్తీకరణ నోటిఫికేషన్‌ విడుదలకు సిద్ధమవుతోంది. అవుటర్‌ రింగ్‌ రోడ్డు పరిధి వరకు మొత్తం 2053 చదరపు మీటర్ల ప్రాంతంలో ఈ 3డీ డిజిటల్‌ ట్విన్‌ను తయారు చేసేందుకు హెచ్‌ఎండీఏ ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. డిజిటల్‌ ట్విన్‌ అంటే నగరానికి ఒక డిజిటల్‌ మోడల్‌.

Follow us on , &

ఇవీ చదవండి