Breaking News

రెండేళ్ల పసివాడితో కలిసి 3వ అంతస్థు నుంచి దూకేసిన తల్లి


Published on: 21 May 2025 15:32  IST

అభం శుభం తెలియని రెండున్నరేళ్ల కుమారుడితో బిల్డింగ్ పైనుండి దూకింది ఓ తల్లి. బంధువుల ఇంటికి శుభకార్యానికి వెళ్లిన సదరు మహిళకు చెందిన ఏడు తులాల బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి. దీంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురై మంగళవారం (మే 20) రాత్రి ఈ దారుణ నిర్ణయం తీసుకుంది. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కాసేపటికే ఆమె మృతి చెందింది. ఆమె కుమారుడు ఆరుష్‌ మాత్రం స్వల్పగాయాలతో బయట పడ్డాడు. వనస్థలిపురం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి