Breaking News

అజారుద్దీన్‌కు శాఖలు కేటాయించిన ప్రభుత్వం


Published on: 04 Nov 2025 16:29  IST

ఇటీవల మంత్రిగా తెలంగాణ కేబినెట్‌లో చేరిన అజారుద్దీన్‌ తాజాగా శాఖలు కేటాయించారు సీఎం. మైనార్టీల సంక్షేమం, పబ్లిక్‌ ఎంటర్‌ప్రైజెస్‌ శాఖలను కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మినిస్టర్‌గా అజారుద్దీన్‌ గత నెల 31న ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లోని దర్బార్‌ హాల్‌లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్‌ జిష్ణు దేవ్‌ వర్మ.. ఆయనతో ప్రమాణం చేయించారు.తనను నమ్మి అవకాశం కల్పించారన్న అజర్‌.. తనకు సపోర్ట్ చేసిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి