Breaking News

భక్తులకు అలర్ట్.. టీటీడీ మరో కీలక నిర్ణయం


Published on: 05 Dec 2025 11:34  IST

తిరుమల తిరుపతి దేవస్థానం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వేంకటేశ్వరస్వామిని దర్శించుకోవడానికి భక్తులు భారీగా తరలి వస్తున్నారు. శ్రీవారి దర్శనానికి సుమారుగా 15 గంటల సమయం పడుతోంది. భక్తుల రద్దీ, పర్వ దినాల నేపథ్యంలో డిసెంబరు, జనవరిలో పలు రోజులు వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది. ఈ మేరకు టీటీడీ ఇవాళ(శుక్రవారం) ఓ ప్రకటన విడుదల చేసింది. డిసెంబరు 23వ తేదీన,డిసెంబరు 29, 30వ తేదీల నుంచి జనవరి 8వ తేదీ వరకు వీఐపీ బ్రేక్ దర్శనాలను నిలిపివేసింది.

Follow us on , &

ఇవీ చదవండి